జగన్ కు బిగ్ షాక్…. వంశీ యూటర్న్

జగన్ కు బిగ్ షాక్.... వంశీ యూటర్న్

0
88

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి…. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీసోడ్ అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది… ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన వంశీ మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు అలాగే లోకేశ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు…

ఆతర్వాత తాను వైసీపీకి మద్దతు ఇస్తానని ప్రకటించారు… దీంతో వంశీ ఇక వైసీపీలో చేరడం లాంఛనమే అనని అనుకున్నారు… అయితే ఈ క్రమంలో బీజీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వంశీ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు… వల్లభనేని జాతీయ పార్టీలో చేరుతారని అనుకుంటున్నానని చెప్పారు…

ఏ పార్టీలో చేరుతారని మీడియా అడుగగా దానికి సమాధానం ఇవ్వలేదు… దీని బటటి చూస్తుంటే వంశీ బీజేపీలో చేరుతారని సుజనా సంకేతాలు పంపారు… అంతేకాదు వంశీ మంచి నిర్ణయమే తీసుకుంటారని అన్నారు సుజనా… అలాగే తనకు చంద్రబాబు నాయుడుతో ఎలాంటి విభేదాలు లేవని అన్నారు…