అధికారంలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి త్వరలో బిగ్ షాక్ తగలనుందని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు… మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెద్ద అల్లుడు రాజకీయ సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని వార్తలు వస్తున్నాయి…
దగ్గుబాటి వైసీపీలో ఆయన భార్య బీజేపీలో ఉన్నారు…ఇటీవలే ఆమె జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడంతో ఉంటే ఇద్దరు ఒకే పార్టీలో ఉండాలని అధిష్టానం సూచించినట్లు వార్తలు వచ్చాయి…
పురందేశ్వరి వైసీపీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారాట… తాజాగా ఈ విషయంలో వైసీపీ నుంచి ఉత్తిడి ఎక్కువ రావడంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారట. అంతేకాదు ఇక నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట దగ్గుబాటి.