యెడుగూరి సందింటి జగన్ మోహన్ మోహన్ రెడ్డి షార్ట్ కట్ లో వైఎస్ జగన్ మోహన్… దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి పరిచయం అక్కర్లేని వ్యక్తి వైఎస్ జగన్. అసలు ఆయన ఇంతటి క్రేజ్ ఎలా వచ్చింది! ఒక మారుమూల పల్లెటూరుకి చెందిన జగన్ రాజకీయ సెటబ్రెటి ఎలా అయ్యారు… ఇలా అనేక విషాయాలను మా ఆల్ టైమ్ రిపోర్ట్ ఛానల్ జగన్ పుట్టిన రోజు (డిసెంబర్ 21) సందర్భంగా పాటకులకు వివరంగా అందిస్తోంది….
వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయమ్మ దంపతులకు వైఎస్ జగన్ జగన్ మోహన్ మోహన్ రెడ్డి, శర్మిల జన్మనిచ్చారు. చిన్నపటి నుంచి జగన్ కు తన సోదరి శర్మిల అంటే ఎంతో ఇష్టం. ఆమె చిన్న గాయం తగిలిన తనకు తగినట్లు భావించే జగన్ శర్మిలను అల్లారు మద్దుగా శర్మిల పాపా అని పిలుస్తారు. ఇటు చెల్లెలు మీద ప్రేమ, అటు తంల్లిదండ్రు చెప్పిన మాటను గౌరవిస్తూ కుటుంబ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జగన్.
జగన్ రాజకీయ ఓనమాలు..
2004లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను బుజాన వేసుకున్న వైఎస్ రాజశేర్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర, సభలు నిర్వహిస్తున్న తరుణంలో జగన్ రాజకీయ ఓనమాలు దిద్దారు. ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి నిలబడిన నియోజకవర్గం పులివెందులలో పార్టీ తరపున ప్రచారం చేసి వైఎస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకు ముందు వ్యాపార పరంగా ఇతర రాష్ట్రాల్లో బిజీగా ఉన్న జగన్ 2004లో రాజన్న తనయుడుగా రాజకీయం వైపు అడుగులు వేశారు.
జగన్ రాజకీయ చరిష్మా… రాజకీయ అరంగేట్రం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మనకంటూ ఒక ప్రత్యేక పత్రిక, ఛానల్ ఉండాలని జగన్ ఆలోచించి అప్పట్లోనే సాక్షిపేరుతో ఒక ఛానల్ రిలీజ్ చేయడంతో రాజకీయంగా చరిష్మకలిగిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.వైఎస్ హయాంలో అభివృద్ది కార్యక్రమాలు పరుగులు తీయడంతో మరోసారి 2009లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో జగన్ రాజకీయ అరంగేట్రం చేసి కడప జిల్లాలో పార్లమెంట్ సభ్యుడుగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అప్పటి నుంచి జగన్ రాజకీయ సెలబ్రెటి అయ్యారు.
రాష్ట్రం అభివృద్ది దిశగా పరవల్లు తోక్కుతున్న తరుణంలో వైఎస్ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రయాణించి 2009లో అకాల మరణం చెందారు. ఇక తన తండ్రి మరణవార్త విని మరణించిన కుటంబాలకు తాను అండాఆ ఉంటానని చెప్పి తాను రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపడతానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం జగన్ యాత్ర చేయడం ద్వారా జగన్ కు జనం బ్రహ్మరథం పట్టారు.
ఇక ఇది గమనించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వెంటనే యాత్ర స్టాప్ చెయ్యాలని అదేశాలు పంపారు. అయితే తాను ప్రజలకు మాట ఇచ్చానని కచ్చితంగా యాత్ర చేస్తానని చెప్పారు. వాస్తవానికి జగన్ కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు చేసి ఉంటే ఇప్పుడు దేశంలో ఏ నాయకుడు అనుభవించని పదవులను అయన అనుభవించేవారు. కానీ వాటన్నింటిని వదులుకుని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పు యాత్ర చేశారు.
ఇక అప్పటినుంచి అసలు కథ స్టార్ట్ అయింది. తాను నేతల మనిషి కాదని ప్రజల మనిషినని చెప్పి జగన్ ఆయన తల్లి విజయమ్మ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ సమయంలో జాతీయ నేతలో పెట్టుకోవద్దని వారితో మనం రాజకీయం చేయలేమని చెప్పారట. అయితే తాను తన ఆత్మగౌరవాన్ని చంపుకుని కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పడంతో తల్లి కొడుకుల రాజీనామాను ఆమోదించడంతో కడప జిల్లాలో ఎన్నికలు జరిగాయి.
ఆ ఎన్నికల్లో వైఎస్ కుటంబానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్ని ఇదే మంచి సమయం అని చెప్పి జగన్ ఫ్యామిలీని ఓడించేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేశారు. ఈ సమయంలో డబ్బు మధ్యం కడప జిల్లాలో ఏరులై పారుతున్నా వైఎస్ కుటుంబానికి ఉన్న ప్రజాధరణను మాత్రం తొలిగించలేకపోయారు. ఈ ఎన్నికల్లో జగన్ కు దేశంలో అత్యంత మెజార్టీకలిగిన నాయకుల్లో మూడవస్థానంలో నిలిచారు. నాటినుంచి నెటివరకు ఈ మెజార్టీని ఎవ్వరు క్రాస్ చేయలేకపోయారు.
జగన్ రాజకీయ సెలబ్రెటి కావడానికి గల కారణాలు….
తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడగు జాడల్లో నడుస్తూ ప్రజా సేవే లక్ష్యంగా చేసుకుని జగన్ ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండటం ఆయన విజయానికి తొలిమెట్లు… ప్రజలందరు ఉండగా తాను ఒంటరి వాన్ని ఎలా అవుతాను అన్న మాట జగన్ను ప్రజలకు మరింత దగ్గరకు చేసింది. తన దగ్గరకు వచ్చివారి సమస్యలను దగ్గరుండి తెలుసుకుని ఆ సమస్యకు వెంటనే పరిష్కారం అయ్యే దిశగా హామి ఇవ్వడం.
ఇలా ఒకటికాదు రెండు కాదు జగన్ అడుగు తీసి అడువేస్తే జనం… జనం అంటూ నిత్యం జనంకోసం పరితపించే నేతగా జననేతగా జగన్ పేరు సంపాదించుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా సంకల్పయాత్రచేసి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా ప్రాంతీయ పార్టీలు సాధించలేని అసెంబ్లీ స్థానాలను సాధించి ఏపీకి రెండవ సీఎంగా పేరు తెచ్చుకున్నారు…
సీఎం హోదాలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు…. నవరత్నాల్లో పొందుపరచని అంశాలను కూడా అధ్యాయనం చేయాంచి వాటికి అనుగునంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు… జగన్ ఏడు నెలల పాలనలో సుమారు 80 శాతం సంతృప్తిగా ఉన్నారని ఇటీవలే సర్వే కూడా చెప్పింది…. అందుకే అడుగడుగునా జననీరాజనాలు పులుకున్న జననేత జగన్ కు ఆల్ టైమ్ రిపోర్ట్ ఛానల్ ప్రత్యేక కంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతుంది.