కిల్లి కృపారాణికి జగన్ బంపర్ ఆఫర్

కిల్లి కృపారాణికి జగన్ బంపర్ ఆఫర్

0
90

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి త్వరలో కీలక పదవిని అప్పజెప్పనున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… గత ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో వెలమ సామాజిక వర్గాని పెద్దపీట వేసింది….

దీంతో మరోసారి టీడీపీనే అక్కడ మెజార్టీని సాధించింది. అందుకే జగన్ ఈ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడంద్వారా ఈ ఎన్నికల్లో మంచి విజయం సాధించారు… అయితే కొన్ని రాజకీయ సమీకరణాలవల్ల కిల్లి కృపారాణికి ఎమ్మెల్యే పదవి దక్కలేదు…

అయినా కూడా ఆమె పార్టీ గెలుపుకోసం తనవంతు కృషి చేసింది… ఇక ఆమె కృషిని గుర్తించిన జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని చూస్తున్నారట… 2004లో వైఎస్ చొరవతో రాజకీయ అరంగేట్రం చేసిన కిల్లి కృపారాణికి ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు

2009లో మరోసారి పోటీ చేసి బలమైన నాయకుడు ఎర్రన్నాయుడును ఓడించి కిల్లర్ గా మారారు ఆ తర్వాత కేంద్రమంత్రి మంత్రి అయ్యారు…