గొల్లపూడి మారుతీ రావు మృతి పట్ల జగన్ చంద్రబాబు దిగ్బ్రాంతి

గొల్లపూడి మారుతీ రావు మృతి పట్ల జగన్ చంద్రబాబు దిగ్బ్రాంతి

0
107

సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీ రావు తుది శ్వాస విడిచారు… చెన్నైలో చికిత్స పొందుతు ఆయన కన్నుమూశారు… ఇక ఆయన మరణ వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు తమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు… రచనలు, నటనలు, వ్యాఖ్యాతగా, సంపాదకుడిగా గొల్లపూడిసేవలు మరువలేవని అన్నారు…. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభుతిని తెలిపారు…

గొల్లపూడి మారుతీరావు ఏప్రిల్ 14, 1939 జన్మించారు.. ఆయన తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశారు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంపాదకుడిగానూ పనిచేశారు.

సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.