వారి జాతకం మార్చిన జగన్…

వారి జాతకం మార్చిన జగన్...

0
91

శాసనమండలిని రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మాణించింది వైసీపీ… సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్ ను ప్రారంభించారు.. తీర్మాణానికి అనుకూలంగా 133 వ్యతిరేకంగా 0 తటస్థులు 0 ఓట్లు పడటంతో స్పీకర్ ఏకగ్రీవంగా తీర్మాణం చేస్తున్నట్లు ప్రకటించారు…

133 మందిలో ఎమ్మెల్సీల హోదాలో మంత్రి అయిన పిల్లి శుభాష్ చంద్రబోస్, అలాగే మోపిదేవి వెకంట రమణ కూడా తీర్మాణానికి అనుకూలంగా ఓటు వేశారు… శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత అది ఉభన పార్లమెంట్ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు… అంతవరకు వీరు మంత్రులుగానే కొనసాగుతారు వీరితోపాటు వైసీపీ తరపున ఉన్న 9మంది ఎమ్మెల్సీలు ఉన్నారు…

అయితే ముఖ్యంగా ఇద్దరు మంత్రులకు జగన్ ఏం హామీ ఇచ్చారనేది చర్చ పార్టీ స్థాపించినప్పటినుంచి జగన్ కు అండగా ఉంటువచ్చారు ఈ ఇద్దురు మంత్రులు కాంగ్రెస్ హయాంలో మంత్రిపదవులను సైతం త్యాగం చేసి జగన్ కు అండగా నిలిచారు… అందుకే వీరికిజగన్ ఎమ్మెల్సీ హోదాలో మంత్రులను చేశారు…

అయితే ఇప్పుడు మండలి రద్దు తో శుభాష్ చంద్రబోస్, అలాగే మోపిదేవికి జగన్ ఎలాంటి హామీ ఇచ్చారని చర్చ తాజా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీరిని రాజ్యసభకు పంపుతారనే వార్తలు వస్తున్నాయి… జగన్ కూడా హామీ ఇచ్చారట…