ఆ టీడీపీ నేత వైసీపీలో చేరికపై జగన్ డెసిషనే ఫైనల్…

ఆ టీడీపీ నేత వైసీపీలో చేరికపై జగన్ డెసిషనే ఫైనల్...

0
81

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో తమ్ముళ్లు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్న సంగతి తెలిసిందే… రాష్ట్రంలో టీడీపీ పుంజుకోవాలంటే సుమారు 20 సంవత్సరాలు పడుతుందనే ఉద్దేశంతో తమ్ముళ్లు వైసీపీ లేదంటే బీజేపీలోకి జంప్ చేస్తున్నారు…

ఇప్పటికే చాలామంది టీడీపీకి గుడ్ బై చెప్పగా ఇక ఇదే బాటలో మరో నేత వైసీపీలో చేరేందుకుసిద్దమయ్యారట… అంతేకాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితులతో లాబీయింగ్ చేస్తున్నారనే సమాచారం వస్తోంది… 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన సుజయ కృష్ణా రంగారావు ఇప్పుడు ఆయన తన సొంత గూటికి చేరేందుకుసిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… .

2014 ఎన్నికల్లో బొబ్బిలి నుంచి వైసీపీ తరపున గెలిచిన సుజయ కృష్ణ ఆ తర్వాత కొద్దిరోజులకు టీడీపీ తీర్థం తీసుకున్నారు… మంత్రి కూడా అయ్యారు…. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు… కానీ గెలవలేకపోయారు ఆయన… ఇక పార్టీ కూడా అధికారం కోల్పోవడంతో తిరిగి తన సొంతగూటికి చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి…