ఈ జిల్లా కలెక్టర్ చేసిన పనికి జగన్ ఫిదా అయ్యారు….

ఈ జిల్లా కలెక్టర్ చేసిన పనికి జగన్ ఫిదా అయ్యారు....

0
100

ఏవరైనా మంచి పని చేస్తే వారిని తప్పని సరిగా మెచ్చకోవాలి అప్పుడే ఆయన చేసిన కృషికితగ్గ ఫలితం, ఆనందం వస్తుందని అంటారు… తాజాగా అనంతపురం జిల్లా కలెక్టర్ చేసిన పనికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిదా అయ్యారు…

నవరత్నాల్లో పొందుపరిచిన రైతు భరోసా పథకాన్ని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ పకడ్బందీగా అములు చేశారు… దీంతో ఆయన జగన్ చేత శబ్బాస్ అనిపించుకున్నారు… తాజాగా జగన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లకు అలాగే జిల్లా ఎస్పీలకు వీడియో కాన్ఫరెన్స్ కాల్ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు..

ఈ సందర్బంగా అనంతపురం జిల్లా కలెక్టర్ మాట్టాడుతూ… జిల్లా వ్యాప్తంగా 481498 రైతు కుటుంబాలకు రైతు భరోసా కింద 390 కోట్లు జమ అయ్యాయని అన్నారు. వ్యవసాయ, రెవిన్యూ బ్యాంకర్ల సహాకారంతో భరోసా సమర్థవంతగా నిర్వహించామని అన్నారు. దీంతో ఆయన్ను జగన్ ప్రత్యేకంగా అభినందించారు..