పెద్దల సభకు ఆ పెద్దాయనను ఫిక్స్ చేసిన జగన్

పెద్దల సభకు ఆ పెద్దాయనను ఫిక్స్ చేసిన జగన్

0
97

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు ఆయనకు అండగా చాలామంది నిలిచారు… అలా అండగా నిలిచిన వారిలో ఒకరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు… జగన్ పార్టీ స్థాపించిన తర్వాత అప్పట్లో మైసూరా రెడ్డి వంటి వారు వైసీపీలోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు…

కానీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన ఉమ్మారెడ్డి జగన్ ను నమ్ముకునే ఉన్నారు… అందుకే ఆయనకు జగన్ మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు… ఎన్నికల మేనిఫెస్టోను సింపుల్ గా అన్ని అంశాలు కవర్ అయ్యేలా చూడటంలో ఉమ్మారెడ్డి కీలక భూమికను పోషించి జగన్ దగ్గర శభాష్ అనిపించుకున్నారు..

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు తగిన గౌరవమే లభిస్తోంది.. జగన్ ఎమ్మెల్సీ కూడా చేశారు… అయితే త్వరలో మండలి రద్దు అవుతుండటంతో ఆయన పదవి పోతుంది… ఇప్పుడు ఆయన్ను పెద్దల సభకు పంపించాలని జగన్ చూస్తున్నారట… త్వరలో ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి అందులో ఒకటి ఉమ్మారెడ్డికి ఫిక్స్ చేశారట జగన్…పెద్దాయనను పెద్దలసభకు పంపిస్తే బాగుంటుందని భావిస్తున్నారట…