చిరంజీవికి రాజకీయాలు అంటే చాలా ఇంట్రస్ట్ అనేది తెలిసిందే.. ఆయన కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేసిన తర్వాత కేంద్రమంత్రిగా చేశారు, రాజ్యసభ పదవిలో ఉన్నారు, అయితే ఆయన పదవీ కాలం పూర్తి అయిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ పుంజుకోకపోవడం తో ఆయన కూడా రాజకీయంగా పెద్దగా యాక్టీవ్ కాలేకపోయారు,
కాని రాజకీయాల పై మాత్రం ఇంట్రస్ట్ అలాగే ఉండిపోయింది, అయితే చిరంజీవికి రాజకీయంగా కోరిక ఉన్నా ఆయన తమ్ముడు తన అన్న సాధించనిది సాధిద్దాము అని అనుకుని జనసేన పెట్టారు…అయితే వైసీపీకి దగ్గర అవుతున్న చిరంజీవికి రాజ్యసభ పదవి ఇవ్వాలి అని జగన్ మదిలో ఉందా, అసలు జగన్ కు చిరు సపోర్ట్ ఇస్తే నేరుగా చిరుకి ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రపోజల్ పెడతారా ? ఇవే ఇప్పుడు పెద్దగా చర్చ జరుగుతున్న విషయాలు.
తాజాగా చిరంజీవికి వైసీపీ నుంచి ఈ ప్రపోజల్ ఇస్తారు అని వార్తలు వస్తున్నాయి అయితే చిరంజీవి ఈ పదవికి ఒప్పుకుంటారా అనేది కూడా పెద్ద సస్పెన్స్ అనే చెప్పాలి… చిరు ఇలా వైసీపికి దగ్గర అవ్వరు అని మెగా అభిమానులు అంటున్నారు.