ఏపీలో ప్రభుత్వ స్కూల్ పిల్లలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్

ఏపీలో ప్రభుత్వ స్కూల్ పిల్లలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్

0
98

ఏపీలో స్కూల్ పిల్లలకు అనేక పథకాలు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యంగా అమ్మ ఒడి పథకం అమలు చేశారు, అలాగే నాడు నేడు కూడా అమలు చేయనున్నారు, ఇక జగనన్న గోరుముద్ద కార్యక్రమం కూడా అమలు అవుతోంది, ఇక వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రారంభించనున్నారు ప్రభుత్వ స్కూల్స్ లో..

తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరొక మంచి అవకాశంతో పాటు గొప్ప శుభవార్త వినిపించారు. కాగా ఏపీలో స్కూళ్లలో నాడు – నేడు కార్యక్రమాన్ని తక్షణమే అమలు చేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.
ఇక మౌళిక వసతులు ఏం కల్పించాలో మొత్తం రిపోర్ట్ సిద్దం చేయాలి అని తెలిపారు, అంతేకాదు మరో శుభవార్త ఏమిటి అంటే.
అన్ని పాఠశాలల్లో డిజిటల్ విద్యకై ఒక స్మార్ట్ టీవీ ని అందజేయనున్నట్లు సమాచారం.

ఇక గోరుముద్ద పథకం పై ఎలాంటి అవకతవకలు ఉండకూడదు అని తెలిపారు, దీనికై యాప్ రూపొందించారు దాని గురించి చర్చించారు.. జగనన్న విద్యా కానుక ద్వారా ఆరు రకాల వస్తువులు వచ్చే ఏడాది నుంచి ఇవ్వనున్నారు, మూడు జతల యునిఫామ్స్, నోట్ పుస్తకాలు, షూ, సాక్స్, బెల్టు, బ్యాగు, టెక్ట్స్ బుక్స్ ఇవ్వబోతున్నారు. అయితే ఇవన్నీ కూడా ఒక కిట్ గా రూపొందించి ఇవ్వనుంది జగన్ సర్కార్.