ఏపీలో సీఎం జగన్ సర్కార్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది, అంతేకాదు ప్రతీ ఒక్కరికి విద్య అందించాలి అని చూస్తున్నారు, కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా సర్కారీ బడులని కూడా తీర్చిదిద్దుతున్నారు. నాడు నేడుతో ఎన్నో మార్పులు వస్తున్నాయి, తాజాగా కీలక నిర్ణయం దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది.
విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా మండల కేంద్రంలోని హైస్కూళ్లను ఇంటర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయనున్నారు. దీంతో చాలా మంది విద్యార్దులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
అయితే ఎందుకు విద్యార్దులు పది తర్వాత ఇంటర్ లో చేరడం లేదు అనేది చూస్తే, చాలా మంది విద్యార్దులు కాలేజీలు దూరంగా ఉండటంతో ఇంటర్ విద్యకు దూరం అవుతున్నారు, అందుకే మండల కేంద్రలో హైస్కూల్ లోనే ఇంటర్ పెట్టాలి అని చూస్తున్నారు… మండల స్థాయిలోనే ఇంటర్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అడ్మిషన్లను గణనీయంగా పెంచొచ్చని భావిస్తున్నారు.