జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం సీఐడీకి కేసు అప్ప‌గింత‌

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం సీఐడీకి కేసు అప్ప‌గింత‌

0
87

కొన్ని కేసులు విచార‌ణ‌లో మాత్రం త్వ‌రిత గ‌తిన నిజా నిజాలు బ‌య‌ట‌ప‌డాలి అంటే క‌చ్చితంగా సీఐడి విచార‌ణ జ‌ర‌గాలి అని చాలా మంది కోర‌తారు, తాజాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం విగ్రహాల ధ్వసం కేసు విష‌యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పిఠాపురం లో గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ఆరు ఆల‌యాలు టార్గెట్ చేసుకుని 12 విగ్ర‌హాలు కూల్చేశారు,
ఆంజనేయస్వామి, సోమేశ్వరస్వామి, సీతారామాంజనేయస్వామి, ముత్యాలమ్మ, కనకదుర్గ ఆలయాల్లోని విగ్రహాలను స్వల్పంగా ధ్వంసం చేశారు. దీనిపై స్ధానికులు ఆల‌య పూజారులు ఈవో పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు.

దీనిపై పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశారు .. భ‌క్తుల మ‌నోభావాల‌కు సంబంధించిన అంశం కాబ‌ట్టి దీనిపై పూర్తిస్ధాయి విచార‌ణ చేయాలి అని ఆదేశాలు వ‌చ్చాయి. దీనిపై స‌ర్కార్ సీరియ‌స్ అయింది, నిజా నిజాలు తేల్చాలి అని సీఐడికి అప్ప‌గించింది ఈ కేసు.