ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 100 రోజులపాలన పూర్తి అయిన సందర్భంగా జగన్ ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు.
జనవరి 26 నాటికి ఏపీలో కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 13 జిల్లాలు ఉన్నాయి. వాటిని 26 జిల్లాలుగా చేస్తే తన పాలనలో కొత్త ఒరవడికను వికేంద్రిక్రుత సేవలు అందివచ్చని జగన్ భావిస్తున్నారు.
ఇదే అంశమై జగన్ మోహన్రెడ్డి రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ను కలిశారు. జిల్లాల విస్తరణపై ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ప్రతీ పార్లమెంట్ స్థానం ఒక్కో జిల్లాగా మారనుంది. దీంతో మొత్తం ఏపీ వ్యాప్తంగా 26 జిల్లాలు కానున్నాయి.