డిగ్రీ విద్యార్థులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్…

డిగ్రీ విద్యార్థులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్...

0
91

ఏపీలో నిరుద్యోగితను సాధ్యమైనంతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది నుంచి డిగ్రీ కోర్సుల్లో భారీ మార్పులు చేస్తోంది… ఇందులో భాగంగా డిగ్రీ కోర్సులను ఉద్యోగ అథారితంగా తీర్చిదిద్దారు… పదినెలల అప్రెంటీస్ ను తప్పనిసరి చేయడంతో పాటు సిలబస్ లోనూ పలు మార్పులు చేశారు… యూజీసీ మార్గదర్శకాలను అనుకుణంగా ఉన్నతవిద్యామండలిరూపొందించిన సిలబస్ ను విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా విడుదల చేశారు…

గతంలో చదివే చదువుకూ ఉద్యోగానికి సంబంధం లేకుండా పోవడంతో డిగ్రీలు పూర్తి చేసి కూడా యువత నిరుద్యోగులుల్లా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఉండేది.. ప్రస్తుతం ఈ పరిస్థితిని మార్చేందుకు యూజీసీతో పాటు ప్రభుత్వాలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి… ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ఉద్యోగ అథారితంగా మార్చేందుకు వీలుగా భారీ మార్పులు చేసేందుకు ఏపీ సర్కార్ గతేడాది నుంచి చేస్తున్న పయత్నాలు వాస్తవ రూపం దాల్చుతున్నాయి…

ఇందులో భాగంగా సిలబస్ మార్పుతో పాటు కొత్తగా అప్రెంటిస్ ఫిప్ ను కూడా తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఇక డిగ్రీ సవ్యంగా పూర్తి చేసే ఏదో రకంగా ఉద్యోగం లభించినట్లే అన్న ధీమా కల్పించేలా ఈ మార్పులు చేస్తున్నట్లు సర్కార్ చెబుతోంది… గతంలో సాంకేతిక విద్యా కోర్సుల్లో మాత్రమే కనిపించే అప్రెంటీస్ విధానాన్ని ఇకపై డిగ్రీ కోర్సులకు కూడా అనుసంధానిస్తున్నారు… అంతేకాదు మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్ షిప్ ను తప్పనిసరి చేశారు…