అమెరికా పర్యటన నుంచి తిరిగొస్తున్న ఎపి ముఖ్యమంత్రి జగనా మోహన్ రెడ్డికి అనేక సమస్యలు స్వాగత చెప్పటానికి రెడీగా ఉన్నాయి. వరదలు, రాజధాని మార్పు, పోలవరం హైడల్ ప్రాజెక్ట్ టెండర్ రద్దుపై కోర్టు తీర్పు, కోడెల ఇంట్లో దొంగతనం ట్విస్ట్ లాంటి అనేక సమస్యలు కీలకంగా మారాయి.
సరైన దిశా నిర్దేశం కోసం మంత్రులు, ఉన్నతాధి కారులు జగన్ రాక కోసమే ఎదురు చూస్తున్నారు.
శనివారం హైదరాబాద్ చేరుకోగానే లోటస్ పాండ్లోని తన నివాసంలో అవసరమైన మంత్రులు, ఉన్నతాధికారులతో జగన్ సమావేశం అవ్వాలని నిర్ణయించారు. ఎక్కోడో, మహారాష్ట్ర, కర్ణాట ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని కొన్ని జిల్లాలు వరదలతో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.
వరదలకు రాజధాని ప్రాంతాలు ముంపుకు గురైన విషయం తెలిసిందే. మొత్తానికి ఇండియాకి తిరిగి వస్తున్నా జగన్కు వివిధ రకాల సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.