ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో చాలా మంది అర్హుల జాబితా నుంచి తొలగించబడ్డారు ..దీంతో పించన్లు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు, అయితే అన్నీ అర్హతలు ఉన్నా తమకు పించన్ ఎందుకు తొలగించారు అనే విమర్శలు జగన్ సర్కారుపై వినిపిస్తున్నాయి, అయితే నవశకం ప్రకారం గ్రామ వాలంటీర్ పూర్తిగా వారి వివరాలు తీసుకుని అర్హులు అయిన వారికి మాత్రమే పించన్లు ఇవ్వడం జరుగుతోంది.
అయితే దీనిపై చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు.. ఇలా విమర్శలు రావడంతో పునఃపరిశీలనకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ సచివాలయాల్లో వాటిని పరిశీలించనున్నారు. అర్హులైన వారు తమ దగ్గర ఉన్న ఆధారాలతో మరోసారి దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.
మీరు గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామసచివాలయాల్లో సంప్రదించవచ్చు. ఇప్పటికే లక్షల మందికి పించన్ల విషయంలో భారీ కోత విధించారు. కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటినా ఐటీ కట్టినా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా సొంత కారు ఉన్నా మీకు పించన్ రాదు.. అయినా మీకు అన్ని అర్హతలు ఉన్నా పించన్ రాకపోతే వారు సరైన డాక్యుమెంట్లు చూపించి మరోసారి పించన్లకు అప్లై చేసుకోవాలి అని తెలిపారు.