బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డిని తోసేసిన జగన్ భద్రతా సిబ్బంది

బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డిని తోసేసిన జగన్ భద్రతా సిబ్బంది

0
91

వైసీపీలో సీమలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంటున్నారు బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి… బైరెడ్డి రాజశేఖరరెడ్డి సోదరుడి కొడుకు సిద్ధార్త్ రెడ్డి వైసీపీలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ సీమలో మరే యువనేతకు లేదు అనే చెప్పాలి, వైసీపీలో జగన్ అంటే ఆయనకు ఎంతో అభిమానం .సీఎం జగన్ కూడా సిద్దార్ద్ కి రాజకీయంగా మంచి పదవి ఇస్తాను మంచి ఉన్నతికి తీసుకువెళతాను అని కూడా చెబుతారు.

అయితే కర్నూలు జిల్లాకు సీఎం జగన్ పర్యటనకు వస్తే అక్కడ సిద్దార్ద్ రెడ్డి సీఎం జగన్ ను కలిసేందుకు వెళ్లారు… ఈ సమయంలో దారుణం జరిగిందట. సీఎం జగన్ ను కలిసేందుకు ఆయన ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అనుమతించలేదు. తర్వాత కొద్దిసేపటికి ఆయన మరోసారి ప్రయత్నించారు. ఈ సందర్భంగా కాన్వాయ్ దగ్గర నడుచుకుంటూ శిబిరం దగ్గరకు వెళ్తున్న బైరెడ్డిని జగన్ భద్రతా సిబ్బంది పక్కకు తోసేశారు.

దీంతో వారితో ఆయన గొడవపడ్డారు ఈ సమయంలో అక్కడకు వైసీపీ నేతలు చేరుకుని వివాదం సర్దుమణిగించారట… అయితే ఇంత కీలక నాయకుడిని కూడా గుర్తించకుండా భద్రతా సిబ్బంది అనుమతించకపోవడం పై ఆగ్రహంగా ఉన్నారట ఆయన అభిమానులు, స్ధానిక లీడర్లకు కలిసే అవకాశం లేకుండా చేస్తారా అని భద్రతా సిబ్బందిపై కోపడ్డారట ఆయన.. నిజమే జిల్లాలోనే కాదు ఏపీలో యువ నాయకుల్లో ఆయనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.. ఆ మాత్రం భద్రతా సిబ్బంది ఆలోచించకపోతే ఎలా … ఇక సొంత పార్టీ నాయకుడికే ఇలా ఉందంటే బయటవారి పరిస్దితి ఏమిటో అనేది చర్చ.