జగన్ దెబ్బకు వారు గజగజ వణికిపోతున్నారు..

జగన్ దెబ్బకు వారు గజగజ వణికిపోతున్నారు..

0
82

తాజాగా ఏబీ వెంటేశ్వర రావును ఏపీ సర్కార్ సస్పెండ్ చేసిని సంగతి తెలిసిందే ఈ సస్పెండ్ పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.. ఏబీ సస్పెన్షన్‌తో సివిల్ సర్వీస్ అధికారులంతా గజగజ వణికిపోతున్నారని సెంట్రల్ డిప్యుటేషన్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నారని ఎల్లో మీడియా రేపో, మాపో సిగ్గులేని రాతలు రాస్తుందని ఆరోపించారు…

నిప్పు నాయుడే అసూయపడేంత నిజాయితీపరుడిని సస్పెండ్ చేస్తారా అంటూ విషప్రచారం మొదలు పెడుతుందని విజయసాయిరెడ్డి ఆరోపించారు…

ఏబీ వెంకటేశ్వర్రావు యూనిఫామ్ లోపల పచ్చచొక్కా తొడుక్కున్న టీడీపీ కార్యకర్త అని బాబు, లోకేశ్ తర్వాత ప్రభుత్వంలో ఐదేళ్లూ ఈయనే చక్రం తిప్పారని ఆరోపించారు… అక్రమ పద్ధతిలో ఆస్తులు పోగేసుకున్నారని తెలిపారు… ఇండియన్ పోలీస్ సర్వీసుకే కళంకం తెచ్చిన ఇలాంటి వారు ఆలస్యంగానైనా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు…