జగన్ నిర్ణయంతో షాకైన కార్యకర్తలు సంచలన నిర్ణయం

జగన్ నిర్ణయంతో షాకైన కార్యకర్తలు సంచలన నిర్ణయం

0
83

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.. కొత్త పథకాలు తీసుకువస్తున్నారు… దీని వల్ల పేదలకు బాగానే ఉంది.. లబ్దిదారులు బాగానే ఉన్నారు, అయితే సీఎం జగన్ కు ఓటు వేసి ఆయన గెలుపుకి కారణం అయిన వారిని కూడా సీఎం జగన్ పట్టించుకోవాలి అని కొందరు ప్రశ్నిస్తున్నారు..

అవును చాలా మందికి పించన్లు రద్దు చేస్తున్నారు, అలాగే రేషన్ కార్డులని కూడా తొలగిస్తున్నారు.. దీనిలో వైసీపీ నేతలవి కూడా ఉంటున్నాయట.. దీంతో వారు కూడా తమ అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాము అంటున్నారు.. అయితే దాదాపు కొన్ని చోట్ల వైసీపీ నేతలకు కూడా అర్హులు కాదు అని రేషన్ కార్డులు తొలగిస్తే.. వారు కూడా మరోసారి అప్లై చేసుకోవడం లేదట.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారు కూడా తమ రేషన్ కార్డు ఇంటిలో పించన్ క్లోజ్ అయితే వాటిని వదిలేస్తున్నారట.. పేదలకి చెందేలా జగన్ అన్న తీసుకున్న నిర్ణయానికి పార్టీ కార్యకర్తలుగా మేము సహకారం అందిస్తాం అంటున్నారు.