పవన్ ను ఇరకాటంలోకి నెట్టిన బీజేపీ…. జగన్ కే మద్దతు

పవన్ ను ఇరకాటంలోకి నెట్టిన బీజేపీ.... జగన్ కే మద్దతు

0
85

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు బీజేపీ భారీ షాక్ ను ఇచ్చింది… వికేంద్రీకరణకు వ్యతిరేకంగా పవన్ పోరాడుతున్నారు.. ఇటీవలే బీజేపీతో పొత్తుకూడా పెట్టుకున్న సంగతి తెలిసిందే… అయితే తాజాగా బీజీపీ ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు వికేంద్రీకరణను స్వాగతించారు…

గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరుతో టీడీపీ నేతలు భూములు కొట్టేశారని ఆరోపించారు… గతంలో ప్రధాని బొమ్మను గాడిదతో ఊరేగించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని అంటున్నారని తెలిపారు…

శాసన మండలిలో వికేంద్రీకరణపై సుదీర్ఘ చర్చ జరిగింది…. గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పువల్లే ఇప్పడు సభలో చర్చ జరుగుతోందని అన్నారు… గతంలో కాపులు తమ రిజర్వేషన్లకోసం ఉద్యమాలు చేస్తే కేసులు పెట్టారని తెలిపారు… ముద్రగడ స్వగ్రామంలో సుమారు 3500 మందిపై కేసులు పెట్టారని ఆరోపించారు…