జగన్ ను టార్గెట్ చేసిన లోకేశ్… వదిలించుకోవడం కష్టమే

జగన్ ను టార్గెట్ చేసిన లోకేశ్... వదిలించుకోవడం కష్టమే

0
114

అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తామంటూ మహిళా ఎంపిడివో సరళపై వైసీపీఎమ్మెల్యేలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని లోకేశ్ అన్నారు.

వైసీపీ పాలనలో మహిళా అధికారిణి బ్రతకలేని పరిస్థితి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.. ఇక రాష్ట్రంలో ఉన్న సామాన్య మహిళల పరిస్థితి తలచుకుంటేనే ఆందోళన కలుగుతోందని లోకేశ్ అన్నారు. రాక్షసపాలనలో మహిళలకు రక్షణ కరువైందని లోకేశ్ మండిపడ్డారు.,

మహిళలపై జగన్ మోహన్ రెడ్డి కక్ష దేనికో అర్థంకావట్లేదని అన్నారు. 45 ఏళ్లకే పెన్షన్ అని మోసం చేసారు. మద్యపాన నిషేధమని ఇళ్ల మధ్యే సారాదుకాణాలు తెరిచి మహిళలను ఇబ్బంది పెడుతున్నారని లోకేశ్ ఆరోపించారు