జగన్ ఆ ఒక్క విషయాన్ని సూటిగా చెప్పగలా….

జగన్ ఆ ఒక్క విషయాన్ని సూటిగా చెప్పగలా....

0
80

వైసీపీ నాయకులు దాగుడుమూతలు ఆడకుండా సూటిగా సుత్తి లేకుండా చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో కలిసి నడవాలి అనుకుంటే ఆ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పండి అని ప్రశ్నించారు.

సోమవారం విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ మోదీని కలిసి ఏం మాట్లాడారు ఆయన ఏం చెప్పారు అనే విషయాలను ప్రజలకు వెల్లడించాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు ఇస్తామ‌ని ఇచ్చిన మాట‌ను మోదీ త‌ప్పార‌ని ఎద్దేవ చేశారు.

దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం కార్పొరేట్ వ్యవస్థకు తొత్తుగా మారిందని ఆరోపించారు. ఇలాంటి స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌కుండా నిజా నిజాలు చెప్పాల‌ని ద్వ‌జ‌మెత్తారు.