వైసీపీకి పండుగ సీఎం జ‌గ‌న్ కు మ‌రో అరుదైన గౌర‌వం

వైసీపీకి పండుగ సీఎం జ‌గ‌న్ కు మ‌రో అరుదైన గౌర‌వం

0
99

ఏపీలో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో సీఎం జ‌గ‌న్ ముందుకు దూసుకుపోతున్నారు, మూడు చోట్ల రాజ‌ధానుల ఏర్పాటు చేస్తూ అభివృద్ది వికేంద్రీక‌ర‌ణ‌కు కంక‌ణం క‌ట్టుకున్నారు. అయితే తాజాగా దేశంలో అరుదైన రికార్డ్ సంపాదించుకున్నారు సీఎం జ‌గ‌న్.

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఓ టెలిఫోన్ సర్వే నిర్వహించింది. అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రులెవరంటూ చేపట్టిన ఈ సర్వేలో తెలుగు రాష్ట్రాల సీఎంలు టాప్-10లో నిలిచారు.

మొద‌టి స్ధానంలో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాధ్ నిలిచారు
ఇక రెండోస్ధానంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిలిచారు
మూడోస్ధానంలో ఏపీ సీఎం జ‌గ‌న్ నిలిచారు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 4వ ర్యాంకు
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే 7వ స్థానంలో ఉన్నారు
తొమ్మిదో స్థానంలో కేసీఆర్ నిలిచారు.