జగన్ కు ఉమా ఛాలెంజ్

జగన్ కు ఉమా ఛాలెంజ్

0
103

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా సవాల్ విసిరారు… జగన్ మాట తిప్పని మడమతిప్పని నేత అయితే దమ్ముంటే కేబినెట్ సామావేశం వెలగపూడి సచివలాయంలో ఏర్పాటు చేయాలని ఛాలెంజ్ చేశారు…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అమరావతి స్మశానం అని సాయంత్రం అయితే పందులు తిరుగుతాయని గతంలో వైసీపీ మంత్రులు కామెంట్స్ కు సమాధానం దొరకాలంటే కేబినెట్ మీటింగ్ ఇక్కడ నిర్వహించాలని అన్నారు…

అధికార బలంతో వైసీపీ నాయకులు విశాఖలో ఇన్ సైడర్ ట్రెండింగ్ లో ఎవరైతే భూములు కొన్నారో వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు… ఉమా అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ మీటింగ్ లు అమరావతిలోనే నిర్వహిస్తామని అన్నారు…