జ‌గ‌న‌న్న విద్యాకానుక ముహూర్తం ఫిక్స్ ? ఏమి వ‌స్తువులు ఇస్తున్నారంటే

జ‌గ‌న‌న్న విద్యాకానుక ముహూర్తం ఫిక్స్ ? ఏమి వ‌స్తువులు ఇస్తున్నారంటే

0
93

ఏపీలో విద్యార్దుల కోసం అమ్మఒడి ప‌థ‌కం తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే, తాజాగా ప్ర‌భుత్వ స్కూల్లో చ‌దివే విద్యార్దుల‌కి జగనన్న విద్యాకానుక పథకాన్ని తెస్తోంది.. అక్టోబర్ 8న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి దీన్ని ప్రారంభించబోతున్నారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 42.34 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగబోతోంది. సుమారు రూ.650 కోట్ల విలువైన స్టడీ కిట్లను విద్యార్థులకు ఇస్తారు.. మ‌రి ఈ ప‌థ‌కంలో విద్యార్దుల‌కి ఏమి ఇస్తారు అనేది చూద్దాం. 1 నుంచి 10 వ త‌ర‌గ‌తి విద్యార్దుల‌కు ఇవి అందిస్తారు.

3 జతల బట్టలు
జత బూట్లు
రెండు జతల సాక్సులు
బెల్టు
టెస్ట్ బుక్స్
నోటు బుక్స్
స్కూల్‌ బ్యాగ్‌