రోజాకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన జగన్

రోజాకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన జగన్

0
102

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నగరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజాకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారని రాజకీయ మేదావులు అంటున్నారు.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజా తనకు మంత్రిపదవి దక్కలేదని అలకచెందిన సంగతి తెలిసిందే.

దీంతో ఆమెకు జగన్ ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవి అప్పగించారు… అధికార పార్టీలో కీలక పదవిలో ఉంటూనే జబర్దస్త్ షోలో రోజా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇదే ఆమెకు తలనొప్పిగా మారుతోంది… జగన్ మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినప్పటినుంచి ఒక్కటే కంకణం కట్టుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతిలేని పాలన అందించాలని చూస్తున్నారు.

అందులో భాగంగానే జగన్ మంత్రుల పనితీరు గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఇంటెలిజెన్స్ వర్గాలను నియమించుకున్నారు… ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం రోజా తన నియోజకవర్గం పనితీరు సరిగ్గాలేదని ఆమెపై వ్యతిరేకత పెరిగిందని తేలిందట. ఈ క్రమంలో జగన్ ఆమెకు వార్నింగ్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం జబర్దస్త్ ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా రెండు బండ్లమీద సవారీ చేస్తున్న రోజాకు ఏదో ఒకటి తేల్చుకోవాని జగన్ సూచించారట.