వైసీపీలోకి డొక్కా…

వైసీపీలోకి డొక్కా...

0
115

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్ తాజాగా ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు.. పార్టీలో చేరేందుకు వచ్చిన డొక్కాను జగన్ సాదరంగా ఆహ్వానించి ఆయనకు పార్టీ కండువా కప్పారు… ఆతర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుంచి జగన్ చేసే అభివృద్ది పనుల్లో తాను భాగస్వామిని అవుతానని తెలిపారు…

కాగా వైసీపీలో చేరక ముందు డొక్కా టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపించారు… 2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో తనకు ప్రత్తిపాడు సీటు కేటాయించారని ఆరోపించారు..

అక్కడ టీడీపీ ఓటమి చెందుతుందని తెలిసి కూడా పోటీ చేశానని తెలిపారు… కాగా కొద్దికాలంగా మణిక్య టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే… ఈ అసంతృప్తితోనే మండలి సమావేశాలకు హాజరుకాలేదు…