ఏపీ రాజకీయాల్లో ముఖ్యమంత్రులుగా వైయస్సార్ , చంద్రబాబు తమ ముద్ర వేసుకున్నారు, ఇద్దరూ కూడా ప్రజా నాయకులు అయ్యారు,అయితే వీరిద్దరూ పార్టీలు వేరు అయినా ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నారు, అలాగే ఒకే పార్టీలో ప్రయాణం మొదలు పెట్టారు, ఈ సమయంలో చాలా మంచి మిత్రులుగా ఉండేవారు అనేది తెలిసిందే.
యువకులుగా వున్నప్పటి నుంచీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి తమ ప్రస్తానం మొదలు పెట్టారు, ఇక తర్వాత చంద్రబాబు టీడీపీలోకి వెళ్లారు, ఇక వైయస్సార్ కాంగ్రెస్ లో ఉండేవారు.
ఇలా ఇద్దరూ విడిపోవడంతో ప్రత్యర్దులు అయ్యారు… పార్టీలు వేరైనా వ్యక్తిగతంగా వీరిద్దరి మధ్య ఆ స్నేహం అలాగే కొనసాగిందని ఇప్పటికీ చాలామంది చెబుతుంటారు. అయితే వీరి స్నేహం పై ఇప్పుడు చిత్రం రానుందట, వీరి రాజకీయం స్నేహం పై సినిమా రానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
విష్ణు ఇందూరి, తిరుమల రెడ్డి కలసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ దర్శకత్వం బాధ్యతలు చేబడుతున్నట్టు సమాచారం. మరి వీరిద్దరి పాత్రలు ఎవరు పోషిస్తారు అనేది చూడాలి.