వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర ఐటీ వింగ్ కన్వీనర్ గా ఎంపికైన శ్రీ ఇరుముళ్ళ కార్తీక్..!!

-

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ఐటీ వింగ్ కన్వీనర్ గా శ్రీ ఇరుముళ్ళ కార్తీక్ గారిని నియమించింది. తెలంగాణ లో కొన్ని రోజుల క్రితం వైఎస్సార్ తెలంగాణ పార్టీ ని స్థాపించి ప్రజలకు స్వచ్ఛమైన పాలనా అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న షర్మిల పార్టీ లోని ఇతర విభాగాలకు సంబంధించి పనులను వేగవంతం చేసింది.. అందులో భాగంగా రాష్ట్ర ఐటీ వింగ్ కన్వీనర్ ని ఎంపిక చేస్తున్నట్లు పార్టీ వర్గాలకు ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

రాజకీయ రంగంలో ఐటీ వింగ్ ఎంతో ముఖ్యమైనది. పార్టీ దశ దిశలను నిర్ణయించే ఈ ఈ విభాగంలో అనుభవజ్ఞులు ఉండాలని భావించి గతంలో రాజకీయ రంగంలో ఎంతో అనుభవం ఉన్న శ్రీ ఇరుముళ్ళ కార్తీక్ ని నిర్యామించింది. పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేకుండా పార్టీ వర్గాల్లో ఎంతో సన్నిహితంగా కొనసాగుతున్న కార్తీక్ కి ఈ పదవి దక్కడం పట్ల పార్టీ వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ ని మరింత బలోపేతం చేసి గెలుపు దిశగా పయనించే విధంగా శాయశక్తులా పనిచేస్తానని అయన తెలపడం విశేషం..

ప్రజలకు తండ్రి అందించిన మంచి సేవ, నిస్వార్థమైన సేవ అందించాలనే లక్ష్యంతో షర్మిల గారు వేసిన తొలి అడుగు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అని కార్తీక్ అన్నారు.. ఈ బాధ్యత ను ఎంతో గొప్ప పనిగా భావిస్తున్నాను. పార్టీ అభివృద్ధి కై , మంచి భవిష్యత్ కై తన పోరాటాన్ని ఎన్నడూ అపనని అన్నారు..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...