వైసీపీలోకి ఆయన సోదరుడు వస్తారా

వైసీపీలోకి ఆయన సోదరుడు వస్తారా

0
90

రాజకీయాల్లో తండ్రి ఓపార్టీ, కొడుకులు ఓపార్టీ, అల్లుడు ఓ పార్టీ, మామ ఓ పార్టీ, ఇక భార్య భర్తలు వేరే పార్టీల్లో ఉండటం కూడా మనం చూశాం, అయితే ఏపీలో కూడా ఇప్పుడు ఓ నాయకుడి గురించి చర్చ జరుగుతోంది, తాజాగా నెల్లూరు రాజకీయాల్లో ఓ అన్నదమ్ముల రాజకీయం గురించి టీడీపీ వైసీపీలో నాయకులు మాట్లాడుకుంటున్నారు.

మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు తెలియని వారు ఉండరు, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఆయన ఎదిగారు. ఇక ఆయన సోదరుడు బీద రవిచంద్ర కూడా టీడీపీలో కొనసాగారు, ఇక ఇటీవల బీద మస్తాన్ రావు వైసీపీలో చేరారు, ఆయనకు ఇప్పుడు రాజ్యసభ పదవి వస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆయన సోదరుడు బీద రవిచంద్ర ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరి అన్న వైసీపీలో రాజ్యసభ సీటు సంపాదిస్తే, కచ్చితంగా ఆయన టీడీపీలో ఉంటారా లేదా వైసీపీలోకి వస్తారా అనే చర్చ జరుగుతోంది.. ఎలాగో మండలి రద్దు అవుతుంది కాబట్టి ఇక ఎమ్మెల్సీ పదవి కూడా పోతుంది అని అంటున్నారు.. మరి ఇప్పటికే జిల్లాలో ఈ అన్నదమ్ములు ఏ పార్టీలో కొనసాగుతారు అనేదానిపై చర్చించుకుటున్నారు, మరి సోదరుడు పొలిటికల్ రూట్ ఎలా ఉంటుందో చూడాలి.