వైసీపీ మద్యపాన నిషేధం వెనుక దాగి ఉన్న అసలు నిజాలు…

వైసీపీ మద్యపాన నిషేధం వెనుక దాగి ఉన్న అసలు నిజాలు...

0
100

ఏపీ సర్కార్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు… ఏపీలోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా చూడనటువంటి హానికరమైన బ్రాండ్స్ ను జే టాక్స్ కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విక్రయిస్తున్నారని ఆరోపించారు…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత ప్రభుత్వం విక్రయిస్తున్న బ్రాండ్స్ అలాగే టీడీపీ హయంలో విక్రయం చేసిన బ్రాండ్స్ ను ఒక వైపు పెట్టుకుని మీడియాకు వివరించారు బోండా…

అంతేకాదు టీడీపీ హయంలో దుకాణాలకు ఇచ్చిన ధరల పట్టికను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం దుకాణాలకు ఇచ్చిన ధరల పట్టికని చదవి వినిపించారు బోండా ఉమా… తాను అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధం చేస్తానన్న జగన్ మోహన్ రెడ్డి లిక్కర్ ను ఆదాయంగా మార్చుకున్నారని ఆరోపించారు…