బ్రేకింగ్ ఇద్దరు వైసీపీ ఎంపీలకు బీజేపీ వల అలర్ట్ అయిన జగన్

బ్రేకింగ్ ఇద్దరు వైసీపీ ఎంపీలకు బీజేపీ వల అలర్ట్ అయిన జగన్

0
129

2024 ఎన్నికల నాటికి బీజేపీ వైసీపీల మధ్య ఏపీలో ప్రధాన పోటీ నడవడం ఖాయమా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది…. వచ్చే ఎన్నికల నాటికి దేశ వ్యాప్తంగా తిరుగులేని శక్తిగా మారాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

అందుకు తగ్గట్లుగానే పలు కార్యక్రమాలు చేస్తూ ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలను బీజేపీలో చేర్చుకుంటుంది. ముఖ్యంగా ఏపీలో బీజేపీ వేసిన ప్లాన్ 60 శాతం ఫలించిందని అంటున్నారు. ఇటీవలే టీడీపీకి చెందిన నలుగురు రాజ్య సభ సభ్యులు బీజేపీలో చేరడం ఇందుకు ఉదాహరణ అని అంటున్నారు…

ఎన్నికల నాటికి మిగిలిన శాతాన్ని ఫిల్ చేయాలని చూస్తోంది బీజేపీ… అందులో భాగంగా అధికార వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలను టచ్ లోకి తెచ్చుకుంది. వారిని పార్టీలో చేర్చుకునే దిశాలో ప్రయత్నాలు చేస్తోంది. ఇంతలో బీజేపీ ప్రయత్నాలను పసి గట్టిన వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. వెంటనే జోక్యం చేసుకుని వారిని నియంత్రించినట్లు తెలుస్తోంది..