వైసీపీకి టచ్ లో మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు

వైసీపీకి టచ్ లో మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు

0
104

ఈ నెలాఖరిలోగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలే అవశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే…

మరికొద్దిరోజుల్లో ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకునే అవకాశం ఉంది… ఇక ఆయన తోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి టచ్ లో ఉన్నారట… మంత్రి పేర్ని నానితో మంతనాలు జరుపుతున్నారట…

ఉత్తరాంధ్రకు చెంది ఒక ఎమ్మెల్యే అలాగే కోస్తాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులకు టచ్ లో ఉన్నారట… జగన్ ఓకే చెబితే తాము తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని అంటున్నారట…

అయితే ఇటీవలే చంద్రబాబు నాయుడు కోస్తా టీడీపీ ఎమ్మెల్యేను పిలిపించుకుని మాట్లాడారట… తాను తన రాజకీయ దృష్ట్య పార్టీ మారాలనుకుంటునని చెప్పారట ఆ ఎమ్మెల్యే…