వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల రాజకీయంగా గత ఎన్నికల ముందు యాక్టీవ్ గా ఉన్నారు. అయితే ఆ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేయకపోయినా యాక్టీవ్ గా ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేయలేదు.. ప్రచారం మాత్రం చేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో షర్మిల ప్రచారం పెద్ద ఎత్తున పార్టీకి ఉపయోగపడింది అని చెప్పాలి.. ఈసారి జగన్ గెలిచి అధికారంలోకి వస్తే జగన్ ఆమెకు పార్టీలో కీలక పదవి ఇవ్వనున్నారట.. ఇప్పుడు వైసీపీ సర్కిల్స్ లో ఈ వార్త వైరల్ అవుతోంది .. అంతేకాదు జగన్ గతంలో పార్టీలో ఆమెకు మంచి పదవి ఇచ్చి ఉంటే ఇప్పుడు ఆమె వైసీపీలో కీలక నాయకురాలిగా ఎదిగేవారు.. కాని ఆమె కుటుంబంలో ఉంటూ తల్లిగా పిల్లలతో ఉన్నారు.
అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి ఆమెను తీసుకురావాలి అని జగన్ భావిస్తున్నారు.షర్మిలకు గెలిస్తే మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేయాలి అని భావిస్తున్నారట.. మంత్రి నారాలోకేష్ పై పప్పు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇలా చేసిన విమర్శలు క్యాంపెయినింగ్ లో ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మరి రిజల్ట్ లో చూడాలి. మరో పక్క మహిళలకు పెద్ద పీట వేయాలి అని జగన్ భావిస్తున్నారు తన కేబినెట్లో అందుకే ఆమెకు కూడా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేయాలి అని చూస్తున్నారు అని తెలుస్తోంది.