కరోనా పుట్టింది వ్యాప్తి చెందింది అంతా చైనాలోని వుహాన్ సిటీలో ..అక్కడ నుంచి ఈ వైరస్ పుట్టింది అనేది తెలిసిందే.. ఇక వైరస్ పుట్టిన ఈ ప్రాంతం దాదాపు మూడు నెలలు లాక్ డౌన్ లో ఉంది, అక్కడ జంతువులు అమ్మే మార్కెట్లు పూర్తిగా అరవై రోజులు క్లోజ్ చేశారు, అయితే దేశంలో రెండు నెలలు అన్నీ కంపెనీలు మూసేశారు.
అయితే తాజాగా ఇప్పుడు రెండోసారి అక్కడ మళ్లీ వైరస్ విజృంభించింది, దీంతో కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ మళ్లీ విధించారు, పూర్తిగా కాకపోయినా కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు పెట్టారు, అయితే తాజాగా ఇప్పుడు నాలుగు రోజుల నుంచి కేసులు సంఖ్య తగ్గింది.
కరోనా వైరస్ పురిటి గడ్డ వూహాన్‌లో ఐదు కరోనా కేసులు నమోదు అయ్యాయి. లాక్‌డౌన్ ఎత్తేసిన నెల రోజుల తర్వాత ఈ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా వీరు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో అందరికి చికిత్స అందిస్తున్నారు, ఆ ప్రాంతంలో ఎవరిని బయటకు రానివ్వడం లేదు.