వుహన్ లో మరో సంచలన నిర్ణయం తీసుకున్న చైనా – 954 కోట్లు

వుహన్ లో మరో సంచలన నిర్ణయం తీసుకున్న చైనా - 954 కోట్లు

0
87

ఈ మహమ్మారి వైరస్ ప్రపంచంలో ఇప్పుడు ఎవరికి కంటిమీద కునుకు ఉండనివ్వడం లేదు, ఇది చైనాలోని వుహన్ లో పుట్టింది, అక్కడ నుంచి వరల్డ్ అంతా చుట్టేసింది, అయితే 60 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కాని చైనాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 83021గా ఉన్నాయి, మరి చైనా చెప్పే లెక్కలపై అనేక విమర్శలు ఆరోపణలుఉన్నాయి.

అయినా చైనా మా లెక్క కరెక్ట్ అని చెబుతోంది, తాజాగా ఏప్రిల్ 12న లాక్డౌన్ ఎత్తివేశాక.. కొత్త కేసులు రావడం మొదలయ్యాయి. అందుకే కీలక నిర్ణయం తీసుకుంది. వుహాన్లో కోటి మందికి కరోనా టెస్టులు చెయ్యాలని నిర్ణయించింది. మే 14న ఈ కార్యక్రమం మొదలైంది. జూన్ 1న ముగిసింది. అంటే రెండు వారాల్లో కోటి మందికి టెస్ట్ చేశారు చైనా వైద్య అధికారులు.

దీని కోసం ఏకంగా 954 కోట్లు ఖర్చు చేశారు,అయితే కేవలం 300 మందికి వైరస్ సోకింది అని తేలింది, దీంతో వారికి చికిత్స అందిస్తోంది. వుహాన్లో సెకండ్ వేవ్ ని కూడా ఆపగలిగామని అంటున్నారు. వుహాన్లో ప్రస్తుతం కోటి 10 లక్షల మంది ఉంటున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చే వారిని కూడా పూర్తిగా పరీక్షలు చేసి అలౌ చేస్తారు దేశంలో.