ఈ నెల 21న తెలంగాణలో ఆ ప్రాంతానికి వైయస్ షర్మిల

-

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టనున్నారు, రాజన్న రాజ్యం తీసుకువస్తామని ప్రకటించారు ఆమె… ఇప్పటికే సీనియర్ నేతలతో ఆమె పార్టీ గురించి మంతనాలు చేస్తున్నారు, ఇక తెలంగాణలో అన్నీ జిల్లాల్లో ఉన్న నేతలు వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో ఆమె సమావేశం అవుతున్నారు, ఒక్కో రోజు ఒక్కో జిల్లా నేతలతో ఆమె భేటీ అవుతున్నారు.

- Advertisement -

పెద్ద ఎత్తున ఈ నేతలు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు చేరుతున్నారు..ఇక తాజాగా నేడు ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు వైయస్ షర్మిల..ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని ఆమె నిర్ణయించారు.

లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్ తో ఖమ్మంకు ఆమె బయల్దేరనున్నారు. ఇక్కడ పలువురు రైతులని కలవనున్నారు, దీని కోసం జిల్లా నేతలు ఏర్పాట్లు చేయనున్నారు, ఇక పోడు భూముల సమస్యలే ఎజెండాగా ఈ సమ్మేళనం చేయనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...