అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించనుంది. ఆయన భద్రతకు సంబంధించి అందిన వేర్వేరు నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అరవై ఏళ్ల పారిశ్రామికవేత్త కోసం ఏకంగా 30 మంది సాయుధ బలగాలను రంగంలోకి దించనున్నారు.