ఆనందయ్య మందు సరే మరి ఆ దోపిడీ మాటేమిటో ? krishnapatnam anandhya Covid Medicine

-

ఆయనకు వ్యాపార కాంక్ష లేదు… మందిని ముంచి కోట్లు సంపాదించాలన్న దురాశ అంతకన్నా లేదు. చచ్చిన శవాలకు వైద్యం చేసి పేలాలు ఏరుకుని తినాలన్న ఆలోచన లేదు. ఆయన చేస్తున్నదంతా తనకు తెలిసిన మంచిని నలుగురికి పంచడం… తనకు తెలిసిన వైద్యంతో నలుగురి ప్రాణాలు పోకుండా చూడడం… ఇప్పటికే మీకు అర్థమైంది కదా? ఆయనెవరో కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య గురించే…

- Advertisement -

ఆనందయ్య తన వృత్తిరిత్యా కరోనా పేషెంట్లకు ఆకుపసర్లతో మందు ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన మందు తీసుకున్నవారిలో ఎంతోమంది కరోనా నుంచి కోలుకున్నారు. కొందరికి కరోనా రాకుండా మందు ఇస్తున్నారు. కొందరికి కరోనా సోకిన తర్వాత తగ్గడానికి మందు ఇస్తున్నాడు. అలా ఆయన చేత మందు తీసుకున్నవారు ఆనందంగానే ఉన్నారు. ఆయన మందు తిన్నవారిలో సైడ్ ఎఫెక్ట్స్ జీరో లెవల్ లోనే ఉన్నాయి. అయినా సరే ఆయన శీలపరీక్ష చేసేందుకు కొన్ని శక్తులు కంకణం కట్టుకున్నాయి.

ఆనందయ్య మందులో శాస్త్రీయత ఉందా? చెట్ల పసర్లతో మందు ఇస్తే భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యలకు ఎవరు బాధ్యులు.. ఆనందయ్య మందు అట్ల.. ఆనందయ్య మందు ఇట్ల అని కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకే బ్యాచ్ ఇప్పటికే రంగంలోకి దిగింది. దాని పని అది చేస్తూనే ఉంది.

మరి ఈ పరిస్థితి పక్కనపెడితే ప్రభుత్వాలు, అధికారులు, మీడియా కూడా ఆనందయ్య మందులో లొసుగులు ఉన్నట్లు చూపేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. మెరుపు వేగంతో ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా మందులో శాస్త్రీయత గురించి అగ్ని పరీక్షలు చేస్తున్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశమంతా కరోనాతో చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారో కరోనా వైద్యం చేయించుకుని చితికిపోయిన వారు అంతకంటే ఎక్కువమంది ఉన్నారు. లక్షలకు లక్షలు దొబ్బి తింటున్న కార్పొరేట్ మాఫియా అధిపతుల గురించి ఎవరూ పట్టించుకోరు.

సిగ్గు లేని ప్రధాన మీడియా తీరు మరీ అధ్వాన్నం… కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ గురించి వార్తలు రాస్తే ఎక్కడ యాడ్స్ ఆపేస్తాయో అని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్ కు 20 లక్షల బిల్లు కట్టించుకుని డెడ్ బాడీ కుటుంబీకుల చేతికి ఇచ్చారు అంటూ ఆసుపత్రుల పేర్లు రాయడానికి మొహం చాటేస్తున్నాయి. రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్న కార్పొరేట్ వైద్యశాలల దోపిడీలపై చర్యలు తీసుకునే దమ్ము ఏ పాలకులకు ఉంటుంటుందనేది ఆలోచన చేయాలి.

ఇప్పటికైనా కార్పొరేట్ మాఫియాకు తలొగ్గకుండా ఆనందయ్య తన మందేదో తనను పంచుకునే వెసులుబాటు కల్పించాలని ఎక్కువ మంది ప్రజలు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...