ఏపీలో మ‌రో ఎన్నిక‌ల సంద‌డి ఎన్నిక‌ల డేట్స్ ఇవేనా

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల సంద‌డి ఎన్నిక‌ల డేట్స్ ఇవేనా

0
409

ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల జాత‌ర జ‌రుగ‌నుంది, సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ పంచాయ‌తీ ఎన్నిక‌లు స్ధానిక సంస్ధ‌ల ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి, కోర్ట్ తీర్పుతో ఈ నెలాఖ‌రున ఎన్నిక‌లు జ‌ర‌పాలి అని స‌ర్కారు భావిస్తోంది, దీంతో ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల సంద‌డి ఉంటుంది అని చెప్పాలి.

దీని కోసం ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేస్తోంది, ఓట‌ర్ల జాబితా కూడా సిద్దం చేసింది. మార్చి నెలాఖ‌రున పూర్తిగా ఎన్నిక‌లు జ‌రుప‌నున్నారు…..జెడ్పీటీసీ ఎంపీటీసీల‌కు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ 7 మార్చి అని తెలుస్తోంది… మున్సిపాలిటీల‌కు 10 మార్చిన నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు.. అలాగే పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ మార్చి 15న విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంది.

ఇక ఈ మూడు ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగే తేదీలు చూస్తే…జెడ్పీటీసీ ఎంపీటీసీల‌కు-21 మార్చిన పోలీంగ్ జ‌రుగ‌నుంది..ఇక మున్పిప‌ల్ పోలింగ్ మార్చి 24 అలాగే గ్రామ పంచాయ‌తీల‌కు 27 మార్చిన పోలింగ్ జ‌రుగ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి…దీనిపై ఈసీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయాల్సి ఉంది.