వాహనాల పై కేంద్రం కీలక ప్రకటన

వాహనాల పై కేంద్రం కీలక ప్రకటన

0
363

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో సారి కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అయితే ఏ రంగాలకు గుడ్ న్యూస్ వినిపిస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు, అయితే తాజాగా కొత్త పాలసీని ప్రకటించారు ఈసారి, ముఖ్యంగా దేశంలోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం పెరుగుతోంది.. ముఖ్యంగా వాహనాల నుంచి వచ్చే పొల్యుషన్ ఎక్కువగా ఉంటోంది ఇలా వాహన కాలుష్యం తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు.

తాజాగా వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలన్నది తమ లక్ష్యమన్న ఆర్థిక మంత్రి.. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతుందని వెల్లడించారు. ఇక బాగా కాలం అయిన వాహానాలు తుక్కు కింద మారుస్తారు.

అంటే వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏళ్లు, కమర్షియల్ వాహనాల లైఫ్టైమ్ని 15 ఏళ్లుగా నిర్దారించింది కేంద్రం.. ఇక వాటిని రోడ్లపై తిప్పే ఛాన్స్ ఉండదు.. ఇది మంచి నిర్ణయం అంటున్నారు అందరూ.. ఇక వచ్చే రోజుల్లో పెట్రోల్ గ్యాస్ డీజీల్ లేని వాహనాలే మార్కెట్లో సత్తా చాటుతాయి.