9 easy tricks to impress your girlfriend:అమ్మాయిలని ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు అనేక కష్టాలు పడుతుంటారు. ప్రేమించిన అమ్మాయి మనసులో చోటు దక్కించుకోవడానికి గూగుల్, యూట్యూబ్, ఫ్రెండ్స్ సలహాలు, ఇలా అన్నీ ఫాలో అయిపోతుంటారు. అయితే అమ్మాయిల మైండ్ సెట్ పై కొంచెం ఫోకస్ పెడితే పడరాని పాట్లు పడాల్సిన అవసరం లేదు. కామన్ ఇండియన్ విమెన్ మెంటాలిటీ తెలిస్తే వారిని డీల్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు వారిని ఇంప్రెస్ చేసే కొన్ని సులువైన మార్గాలేంటో తెలుసుకుందాం.
1.డ్రెస్సింగ్: ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటుంటారు. ఆమెని కలవడానికి వెళ్ళినప్పుడు లేదా ఇద్దరూ కలిసి బయటకి వెళుతున్నప్పుడు మంచిగా డ్రెస్ అప్ అవండి. మీకు కంఫర్ట్ ఉండే దుస్తులు ధరించండి.
2.హెయిర్ కట్: చక్కగా హెయిర్ కట్ చేసుకుని, గడ్డం ట్రిమ్ చేసుకోండి. మీ జుట్టుపై ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఆకర్షణీయంగా ఉండడంతో అమ్మాయి ఇంప్రెస్ అవుతుంది.
3.కళ్ళలోకి చూడండి: అమ్మాయి మీతో మాట్లాడుతున్నంత సేపు మీరు ఆమె కళ్ళవైపు చూడండి. ఆమె కళ్లవైపు తదేకంగా చూడడంతో వారిలో పాజిటివ్ ఫీల్ కలుగుతుంది. మీకు అట్రాక్ట్ అవుతారు.
4. వివరాలు తెలుసుకోండి: అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఆమె ఇష్టాయిష్టాల గురించి అడగండి. తనకి సంబంధించిన ప్రశ్నలు వేయడంతో ఎక్కువసేపు మీతో మాట్లాడుతుంది.
5. శ్రద్ధ పెట్టండి: అమ్మాయి ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినండి. ఆమె చెప్పేది అనుసరించండి. అనవసరంగా ఆమెను ఇబ్బంది కలిగించవద్దు. ముఖ్యంగా ఫోన్ వాడవద్దు.
6.పొగడ్త: పొగడ్తలంటే నచ్చని మనుషులు చాలా తక్కువ. అమ్మాయి వద్ద కూడా ఆమెలో మీకు నచ్చిన విషయం చెప్పి పొగడండి. అలా అని చెప్పి అబద్ధాలు చెప్తే మొదటికే మోసం రావచ్చు జాగ్రత్త!
7.సలహా అడగండి: అమ్మాయి నుంచి సలహా తీసుకుంటే తక్కువ అయిపోతామని చాలామంది అబ్బాయిలు భావిస్తుంటారు. కానీ వారి నుండి సలహా తీసుకోవడం వలన వారు ఇంప్రెస్ అవుతారు. అమ్మాయికి పూర్తిగా అవగాహన ఉన్న విషయంలో సలహా తీసుకోవడంతో మీపై ఆమెకు మంచి అభిప్రాయం కలుగుతుంది.
8.స్వేచ్ఛ ఇవ్వండి: డెసిషన్ తీసుకునే విషయంలో అమ్మాయికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి. వారు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినండి. వారి అభిప్రాయాన్ని గౌరవించండి.
9.స్నేహితులతో సరదాగా: అమ్మాయి స్నేహితులతో సరదాగా గడపండి. వారి ముందు ఆమెను చిన్నబుచ్చే విషయాలు కాకుండా, తనలోని మంచి గుణాల గురించి ప్రస్తావించండి. దీంతో మీపై మంచి అభిప్రాయం వస్తుంది.