Chanakya Neeti |చాణక్యుడు అర్థశాస్త్రం లాంటి మహా గ్రంథం రచించి కౌటిల్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన వ్యూహాలతో చంద్రగుప్తుడిని రాజుగా చేశాడు. అంతేకాదు, ఆయన మనిషి జీవితంలో అనుసరించాల్సిన ఎన్నో విషయాలను చాణక్యనీతి గ్రంధం తెలియజేశాడు. ఒక వ్యక్తి సంతోషంగా ఎలా ఉండాలి? జీవితంలో విజయం ఎలా సాధించాలి? అయినవారితో ఎలా మెలగాలి, శత్రువుని ఎలా జయించాలి వంటి ఎన్నో ఆచరించదగ్గ అంశాలను ఆ గ్రంధంలో రాశాడు. అందులో ఆచార్య చాణక్యుడు మహిళల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు.
ఆచార్య చాణక్యుడి ప్రకారం స్త్రీ మనసు వెంటనే అర్ధం కాదు. కొన్నిసార్లు వారు ఆలోచించేది, వారు చెప్పేది వేర్వేరుగా ఉంటాయని చెప్పాడు. పురుషులతో పోలిస్తే మహిళలకు కొన్ని విషయాల్లో కోరికలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నాడు. అయితే వాటి గురించి స్త్రీలు ఎప్పుడూ బయటకు చెప్పరని తెలిపాడు. చాణక్యుడు వేటి గురించి అలా చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.
Chanakya Neeti |ఆకలి ఎక్కువ:
మగవారికంటే ఆడవారికి ఆకలి ఎక్కువగా ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. వారికి ఆహారం ఎక్కువ అవసరమవుతుందని, ఎందుకంటే వారు పురుషుల కంటే ఎక్కువ శారీరక శ్రమ చేయాల్సి ఉంటుందని చాణక్యుడు తెలిపాడు. పురుషులు బయట పని చేస్తే.. స్త్రీలు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఇంటికి సంబంధించిన ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు.
అలాగే శరీరంలోనూ స్త్రీ వ్యవస్థ పురుషుల కంటే ఎక్కువగా పని చేయాల్సి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. ఇంతగా శ్రమించే వారికి సాధారణంగా శక్తి కూడా ఎక్కువగా కావాల్సి ఉంటుందని, అందుకే ఆకలి ఎక్కువ ఉంటుందని, కానీ వారు బయట పడరని చాణక్యుడు చెప్పాడు.
ధైర్యం ఎక్కువ:
పురుషుల కంటే స్త్రీలకు ధైర్యం ఎక్కువ. చాలా విషయాల్లో వాళ్లు భయపడతారేమో, బొద్దింకను చూస్తూ అరవడం, చీకట్లో నడవడానికి భయపడటం, వీధి కుక్కలను చూసి పరిగెత్తడం లాంటి మహిళలు చేస్తారు కావొచ్చు. కానీ వారికి ఇష్టమైన విషయంలో, కావాల్సిన అంశంలో, అవసరంలో వారు దేనికీ భయపడరు. మహిళలు మానసికంగా పురుషుల కంటే చాలా దృఢంగా ఉంటారు. మానసికంగా చాలా ధైర్యం చూపిస్తారు.
కోరిక ఎక్కువ:
స్త్రీ యొక్క లిబిడో పురుషులకు చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శారీరక సంబంధం ముఖ్యం కాదు, భావోద్వేగ స్థితి కీలకం. శారీరక కోరిక విషయంలో పురుషులు త్వరగా ఉద్వేగానికి లోనవుతారు, అంతే చల్లబడిపోతారు. కానీ స్త్రీలు ఉద్వేగానికి రావడానికి సమయం తీసుకుంటారు, ఆ సంతృప్తిని ఎక్కువ సేపు ఆస్వాదిస్తారు.
Read Also: చాణక్య నీతి: యోగి స్త్రీని ఏ దృష్టితో చూస్తాడో తెలుసా?
Follow us on: Google News