Chanakya Niti: ఆదర్శప్రాయమైన జీవన విధానం, మానవీయ విలువల గురించి అర్థం చేసుకోవడానికి చాణక్యుడు అనేక గ్రంథాలను అధ్యయనం చేశాడు. వాటి వాటి సారాంశాన్ని వెలికి తీసి సులభమైన శైలిలో నీతుల రూపంలో మనకు అందించాడు. చాణక్యనీతిలో విచ్చలవిడిగా ఖర్చు చేసేవారు, ఆశ్రయం లేని చిన్నారి, నిత్యం గొడవలకు దిగేవారు, భార్యను నిర్లక్ష్యం చేసే వారు ఏమవుతారో వివరంగా చెప్పాడు చాణక్యుడు.
చాణక్య నీతి ప్రకారం జీవితంలో మనం వేసే ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండాలి. నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చి ముందుకు సాగాలి. ప్రతి పైసా ఆచితూచి ఖర్చు పెట్టాలి. కొందరు డబ్బు ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేసి ఆ తర్వాత ఆలోచించడం మొదలు పెడతారు. డబ్బులు లేని జీవితం కష్టాల పాలవుతుంది. అయినవాళ్ల ఆలనాపాలనా లేని, మంచి చెప్పేవారు లేని చిన్నారి దారి తప్పుతుంది. అందరితో గొడవలకు దిగేవాడు మంచి చేయడం గురించి ఆలోచించడు. భార్య నిజమైన స్నేహితురాలు. ఆమెను గౌరవంతోను ఆధారంతోనూ చూడాలి. భార్యను నిర్లక్ష్యం చేసి, ఆమెని సరిగా ఆదరించని భర్త నాశనం అవుతాడని చాణక్యుడు చెప్పాడు.