Husbands who marry women of this Zodiac sign should be careful: సహజంగా స్త్రీలు తన భర్త గాని, తను ఇష్టపడిన వ్యక్తి గాని మరో అమ్మాయి తో చనువుగా ఉంటే సహించలేరు. స్త్రీలు ఏదైనా ఇతరులతో పంచుకోగలరు కానీ తను ప్రేమించిన వ్యక్తిని మాత్రం ఇతరులతో పంచుకోవడానికి ఎన్నటికీ ఇష్టపడరు. కనీసం కన్నెత్తి చూసినా తట్టుకోలేరు. అందులోనూ ఓ రాశి స్త్రీలు తన భర్త పరాయి స్త్రీని చూస్తే పొరపాటున కూడా క్షమించరట. ఇప్పుడు ఏ రాశి స్త్రీలు అలా ఉంటారో తెలుసుకుందాం.
మేష రాశి స్త్రీలు తొందరగా ఎవరి ఆకర్షణలో పడరట. సంసారిక జీవితంలో భర్తకు అన్ని విధాలా సహకరిస్తారట. కుజుని ఆధిపత్యంలో ఉన్న స్త్రీ గనుక తన భర్త పర స్త్రీని కన్నెత్తి చూసినా సహించదట. భర్త గనుక తప్పటడుగు వేస్తే అతనిని ఎన్నటికీ క్షమించదు. అతనిని దూరంగానే ఉంచుతుంది. కానీ సంసారం విచ్చిన్నం చేసుకోదు. అంతేకాదు స్త్రీ పురుషులతో సమానంగా స్నేహం చేస్తుంది. అది స్నేహం వరకు మాత్రమే. ఏ పురుషుడైనా తొందరపడితే శాశ్వతంగా అతనిని దూరంగా ఉంచుతుంది. అందుకే ఈ రాశి(Zodiac sign) స్త్రీలతో ఎంత బుద్ధిగా ఉంటే అంత మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.