Love language: ఈ ప్రేమ భాష తెలుసా మీకు?

-

Love language:మీ బంధం మరింత ధృఢంగా ఉండాలని కోరుకుంటున్నారా? మనసు విప్పి మాట్లాడినా.. ప్రతి చిన్న విషయాన్ని వారితో పంచుకున్నా.. మీ మధ్య ఏదో మ్యాజిక్‌ మిస్‌ అవుతుందని అనుకుంటుంటే.. మీకు ఇంకా లవ్‌ లాంగ్వేజ్‌(Love language) తెలియదనే అనుకోవాలి. ఏంటి బంధాన్ని బలపరుచుకోవటానికి ఒక భాష ఉందా అని అనుకుంటున్నారా.. ఉంది.. ఇది పూర్తిగా చదివాక మీకూ అర్థం అవుతుంది.

- Advertisement -

ప్రేమ భాషలో ప్రేమ పదాలు చాలా ముఖ్యం. ప్రేమ పదాలు అంటే ఏమిటో అనుకోకండి.. మీ భాగస్వామిని ప్రశంసించటం, కొత్త పనులు మెుదలుపెట్టేటప్పుడు ప్రోత్సాహించటం, ఆప్యాయతతో దగ్గరకు తీసుకోవటం వంటివి మీ బంధాన్ని మరింత ధృఢంగా ఉండేలా చేస్తాయి.

బంధంలో పొరపెచ్చులు రావటం సహజం. కోపంలో ఎన్నో మాటలు అనేయటం అనుకోకుండా జరిగిపోతుంది. అయ్యో ఆ మాట అనకుండా ఉండాల్సింది.. అని మీలో మీరే పశ్చాత్తాప పడకండి. వెళ్లి మీ భాగస్వామిని ఆలింగనం చేసుకొని సారీ చెప్పేయండి. అప్పటికీ కోపం తగ్గకపోతే.. కౌగిలి వదలకుండా.. ఎందుకు కోప్పడ్డారో.. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో చెప్పేయండి. సారీ చెప్పినప్పుడే సగం కోపం ఆటోమెటిక్‌గా పోతుంది. కౌగలింతలో మిగిలిన సగం కోపం పోయి.. పెదవులపై చిరునవ్వు చేరుతుంది.. అదే లవ్‌ లాంగ్వేజ్‌(Love language)స్పెషల్‌

ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు వాదనలకు దిగకండి. వాదనకు దిగే విధంగా సంభాషణ జరిగేలా ఉంది అంటే, సాధ్యమైనంత వరకు ఆ సంభాషణను ముగించటానికే ప్రయత్నించండి. భాగస్వామి ఏదైనా చెప్పేటప్పుడు, వారి కళ్లల్లోకి చూడండి. వారు నవ్వేటప్పుడు, బాగున్నారని కాంప్లిమెంట్‌ ఇవ్వండి, మీ బంధం మరింత దగ్గర అవుతుంది.

శారీరక స్పర్శ మీరు మీ భాగస్వామిని ఏ విధంగా కోరుకుంటున్నారన్నది తెలియజేస్తుంది. ప్రేమతో వారిని దగ్గరకు తీసుకున్నారా.. కామంతో దగ్గరకు తీసుకున్నారా అన్నది ఒక్క టచ్‌లోనే తెలిసిపోతుంది. ఎంత పెళ్లి అయినప్పటికీ, భాగస్వామికి ఇష్టం లేకుండా సెక్స్‌ చేయటానికి ఒత్తిడి చేయకండి. ఎందుకు వద్దని అనుకుంటున్నారో అడిగి తెలుసుకోండి. ఇబ్బందులు ఏమైనా ఉంటే, పరిష్కరించేందుకు ప్రయత్నించండి. అంతేగానీ, కోప్పడి భాగస్వామిని నిందించకండి. ఇటువంటి చర్యల వల్ల భాగస్వామికి మీ పట్ల ఒక విధమైన అసహ్య భావం ఏర్పడే ప్రమాదం ఉంది.

ముఖ్యమైన రోజులు అంటే పెళ్లి రోజు, పుట్టినరోజులను మర్చిపోకుండా ఉండండి. ఇవి మీ భాగస్వామి దృష్టిలో ఎంతో విలువైన రోజులుగా ఉంటాయి. కాబట్టి సర్ప్రైజ్‌ గిఫ్ట్‌లు ఇవ్వటం, బహుమతులు ఇవ్వటం మిమ్మల్ని మరో స్టేజ్‌కు తీసుకువెళ్తుంది. బహుమతులు అంటే మరీ ఆర్భాటాలకు పోకుండా సింపుల్‌గా ఉండేటట్లు చూసుకోండి.

మీ నుంచి మీ భాగస్వామి ఏమి కావాలని కోరుకుంటున్నారో వారి చర్యల బట్టి అర్థం అవుతుంది. ఆ పనులు చేసి పెట్టండి. లేదా తనకు ఏమి కావాలో తననే అడిగి చేయటం ఇంకా ఉత్తమం. ఎందుకంటే, కొన్నిసార్లు సైలెంట్‌గా ఉండటం అనేది మనస్పర్థలకు దారి తీసే అవకాశం ఉంది. పదిమందిలో ఉన్నప్పుడు చులకనగా ఎప్పుడూ మాట్లాడకండి. తక్కువ చేసే విధంగా ఉంటే చర్యలకు దూరంగా ఉండండి. ఒకవేళ భాగస్వామి తెలియక తప్పు చేస్తే.. నలుగురిలో నిందిచకుండా, అక్కడ వారికి సర్ది చెప్పండి. తరువాత ఏకాంతంగా ఉన్నప్పుడు అర్థం అయ్యే విధంగా చెప్పండి. ఈ చర్యలన్నీ మీ భాగస్వామికి, మీ మధ్య బంధం మరింత బలపడే విధంగా చేస్తాయి. ఒకసారి మీరూ ట్రై చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...