Marriage: ఆ వయస్సులో పెళ్లా.. అయితే జాగ్రత్తలు పాటించాల్సిందే!

-

Marriage age those who want to get married before the age of 30 Know about these things: మారిన జీవనశైలితో చాలా మార్పులు వచ్చాయి. పెళ్లి విషయంలో కూడా ఇప్పుడు యువత అభిప్రాయం మారింది. మగవారితో సమానంగా ఆడవారు సైతం ఉద్యోగాలు చేయటం, ఆర్థికంగా వారు నిలదొక్కుకోవటం, డబ్బు సంపాదనలో పడి పెళ్లిని పక్కన పెడుతున్నారు. దీని కారణంగానే 30 ఏళ్లు వచ్చినా పెళ్లి గురించి ఆలోచించటం లేదు. బాగా స్థిరపడిన తరువాతే, లేటు వయస్సులో పెళ్లిపీటలు ఎక్కుతున్నారు నేటి మహిళలు. అయితే మూడు పదుల వయస్సులో పెళ్లి చేసుకున్నవారికి కొన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు నిపుణులు. మరి ఆ ఇబ్బందులు ఏంటో, వాటిని ఏ విధంగా గట్టెక్కాలో తెలుసుకుందాం.

- Advertisement -

20-30 ఏళ్ల సమయంలో తన గురించి, తన కెరీర్‌ గురించి తప్పా కుటుంబంపై ఎవరికీ అంత ఏకాగ్రత ఉండదు. దీనికి మహిళలు ఏమీ అతీతులు కాదు. అప్పటి వరకు ఆఫీసు, సంపాదనపై ఉన్న మహిళ .. పెళ్లి కాగానే, కుటుంబంపై ఏకాగ్రత పెట్టలేరు. క్రమంగా అలవాటు అవుతుంది. అది కూడా, కుటుంబంపై క్రమంగా ఆసక్తి పెంచుకునేందుకు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే. ఎక్కువుగా భార్యాభర్తలు ఇద్దరి వయస్సు 30 దాటిన తరువాత పెళ్లి (Marriage) చేసుకొని ఉంటే, సంతృప్తిగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదించలేరని నిపుణులు చెప్తున్నారు.

మనస్పర్థలకు ఆస్కారం
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలుకు వెళ్లటం, ఎప్పుడో ఇంటికి తిరిగి రావటం వల్ల.. ఒకరి గురించి మరొకరు తెలుసుకునే అవకాశం ఉండదు. దీనివల్ల ఇద్దరి మధ్యా మనస్పర్థలు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది. ఈ కారణంతోనే లేటు వయస్సులో పెళ్లి చేసుకున్నా.. చాలా త్వరగా విడాకులు తీసుకుంటున్నవారు ఎక్కువయ్యారు.

పిల్లలు పుట్టే అవకాశం తక్కువ
మహిళలలో ముప్పై దాటాక, వారి శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. రుతుక్రమంలో మార్పులు రావటం వల్ల, పెళ్లి అనంతరం పిల్లలు పుట్టే అవకాశం తక్కువ. పైగా భార్యాభర్తలిద్దరూ సంపాద కోసం పరుగులు తీయటంలో బిజీబిజీగా గడపటంతో.. దంపతుల మధ్య ఏకాంతం చాలా తక్కువుగా ఉంటుంది. శృంగార జీవితాన్ని ఆస్వాదించకుండా.. యాంత్రికంగా చేస్తారని నిపుణులు తెలిపారు. దీని కారణంగానే మహిళలు అండం విడుదలయ్యే సమయంలో వీరు కలిసే అవకాశం తక్కువని అంటున్నారు.
మరి ముప్ఫై దాటిని వారు తమ దాంపత్య జీవితాన్ని సుఖంగా గడపటానికి కొన్ని టిప్స్‌ చెప్తున్నారు నిపుణులు. ఈ చిట్కాలు పాటిస్తే.. కుటుంబంలో ఎటువంటి చింతా ఉండదని అంటున్నారు.

1. ఇద్దరూ ఉద్యోగాలు వెళ్లినట్లయితే, ఇద్దరూ వీకాఫ్‌ రోజులలో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఇద్దరి ఇష్టాలు, అయిష్టాలు తెలుసుకోవటంతో మనస్పర్థలు రాకుండా ఉంటాయి. ఇంట్లో పనిని ఇద్దరూ షేర్‌ చేసుకోవటంతో, ఇబ్బందులే ఉండవు.

2. పెళ్లి కాగానే పిల్లల గురించి ప్లాన్‌ చేసుకోవటం ఉత్తమం. ఈ వయస్సులో మిస్‌ కారేజ్‌ అయ్యే రిస్క్‌ ఎక్కువ. అందువల్లే నిపుణులు పిల్లల గురించి ప్లాన్‌ చేసుకోమని చెప్తున్నారు.

3. సెక్స్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేయండి. కొత్తకొత్త ప్రదేశాలకు వెళ్తూ ఉండటంతో మూడ్‌ ఛేంజ్‌ అవుతూ ఉంటుంది. యాంత్రికంగా ఉండకుండా, నవ్వుతూ, నవ్విస్తూ ఉండండి.

4. ఆఫీసు విషయాలు ఇంటి వరకూ తీసుకురాకండి. కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉండటం అలవాటు చేసుకోండి.

5. వారాంతాల్లో, పండగల సమయంలో ఇరు కుటుంబ సభ్యులతో సరదాగా గడపండి.
ఇవి పాటిస్తే.. లేటు వయస్సులో పెళ్లి అయినా.. దాంపత్య జీవితంలో సుఖంగా ఉండొచ్చు

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...