Reasons for Men Stay Single: సింగల్‌గా ఉండటానికి ఇవే కారణాలు..!

-

Most Common Reasons for Men Stay Single అరే మావా మనం సింగిల్.. సింగిల్ లైఫ్ ఈజ్‌ కింగ్ లైఫ్‌ బావా.. జీవితాంతం ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతా.. అనే మాటలు రోజూ మన స్నేహితుల నుంచి వింటునే ఉంటాం… సోషల్ మీడియాలో కూడా బీయింగ్ సింగిల్, సింగిల్‌ కింగులం, సింగిల్ రెడీ టూ మింగిల్ లాంటి పోస్టులు, మీమ్స్ చూస్తూనే ఉంటాం. అయితే.. కాలేజీ కుర్రాల నుంచి, పెళ్లి వయసు వచ్చినా కొందరు సింగిల్‌‌గా ఉండిపోతారు. ఇలా సింగిల్‌‌గా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..

- Advertisement -

జీవితంలో ఏర్పడిన చేదు అనుభవాలు, ప్రేమ విఫలం, ప్రేమలో మోసపోవడం వల్ల చాలా మంది యువకులు తమ జీవితంలో బాగస్వామి వద్దు అనే నిర్ణయానికి వచ్చేస్తుంటారు. ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమన్నా వారిలో చలనం ఉండదు. గతాన్ని తలచుకొని బాధ పడుతూ.. కొందరు జీవితాంతం సింగిల్‌‌గా ఉండి పోతున్నారు. చాలా వరకు ఇటువంటి వ్యక్తులు కొత్త సంబంధాన్ని ఏర్పరుచుకోరు. ఒక వేళ ఏర్పరుచుకోవాలని చూసినా.. వారిలో ఉన్న అభద్రతా భావంతో ఎవరి నమ్మలేక సింగిల్‌‌గా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అందువల్ల, వారు కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని పరిశోధకులు చెబుతున్నారు.

అయితే కొందరు ఇందుకు భిన్నంగా సింగిల్‌‌గా ఉండిపోతారని.. ఇంట్రావర్ట్‌‌గా ఉంటూ అమ్మయిలతో మాట్లాడాలంటే సిగ్గు, మాట్లాడితే ఎదుటి వారు ఏమనుకుంటారోనన్న భయంతో ఉంటారని నిపుణులు అంటున్నారు. వీరిలో మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడగలనా అనే ఆనుమానం ఎక్కువ ఉంటుందని… దీంతో తమ మనసులో ఏముందో పక్క వారికి చెప్పరు.. సరికదా, కనీసం వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయారు… దీంతో ఇంట్రావర్ట్స్ ఒంటరిగా ఉండిపోతారు.

మరికొందరు ఫ్లర్టింగ్ స్కిల్స్ లేకపోవడం వల్ల సింగిల్‌‌గా ఉండిపోతారని, ప్రేమించిన వ్యక్తితో కమ్యూనికేట్ చేయలేరని పరిశోధనలు చెప్తున్నాయి.. ఇటువంటి పురుషులను అమ్మయిలు అంతగా ప్రేమించరు. అయితే పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం సమాజంలో ‘సింగిల్ షేమింగ్’ అనేది బలంగా నాటుకుపోయిందని.. యూకేలోని 1000 మందిలో 52 శాతం మంది సింగిల్ షేమింగ్‌ను ఎదుర్కొంటున్నట్లు డేటింగ్ సర్వీస్ మ్యాచ్ అనే సంస్థ ఒక సర్వేలో (Reasons for Men Stay Single) గా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...