Parenting tips : పిల్లల భవిష్యత్‌ మీ తీరుపై ఆధారపడి ఉంటుంది..!

-

Parenting tips for Your children’s life: మీరు అలా ఉండకూడదు.. ఇలా ఉండకూడదు.. ఇది మాత్రమే చెయ్యాలి.. అది చెయ్యకూడదు అంటూ మీ పిల్లలకు కండీషన్స్‌ పెడుతున్నారా? వారితో కఠినంగానే ఉంటేనే మనపై గౌరవ, మర్యాదలతో ఉంటారనీ, చెప్పిన మాటల వింటారని అనుకుంటున్నారా? అయితే క్రమంగా మీరే మీకు మీ పిల్లలకు మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించుకుంటున్నారన్నమాట. నమ్మకం కలగటం లేదా.. అయితే ఈ Parenting tips పూర్తిగా చదవండి.

- Advertisement -

మీ ప్రవర్తన ఆధారంగానే ప్రవర్తిస్తారు
పిల్లల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మీరు ప్రవర్తించే తీరు, వారితో గడిపే సమయం, మాట్లాడే ప్రతిమాట వారిని ప్రభావితం చేస్తాయి. మీ ప్రవర్తన ఆధారంగానే.. వారు కూడా ప్రవర్తిస్తారని తల్లదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నాం, క్రమశిక్షణతో పెంచేస్తున్నాం అంటూ కఠిన నియమాలు పెడితే మెుదటికే మోసం వస్తుంది. మీతో వారు ఎప్పటికీ క్లోజ్‌గా మూవ్‌ కాలేరు అటువంటి చర్యల వల్ల. క్రమశిక్షణ పేరిట వారిని శిక్షిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. మీకు భయపడి ఇంట్లో నెమ్మిదిగా ఉన్నా.. బయటకు వెళ్లినప్పుడో, మీరు వారితో లేనప్పుడో, పాఠశాలలల్లోనూ దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా తప్పు చేస్తే.. పనిష్మెంట్‌ ఇవ్వటం పిల్లలలో ప్రతికూల భావాలు ఏర్పడతాయి. ఆ పనిని ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రేమగా అడిగి తెలుసుకోండి.. మరలా అటువంటి పనులు చేయవద్దని సున్నితంగా మందలించండి.. అంతేగానీ కఠినంగా వ్యవహరించకండి.

రూల్స్‌ పెట్టకండి
అలా మాట్లాడకూడదు.. ఇలా ఆడకూడదు అంటూ రూల్స్‌ పెట్టకండి. ఇంట్లో మీరు సున్నితంగా మాట్లాడితే.. క్రమంగా మిమ్మల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారని గుర్తుపెట్టుకోండి. పిల్లలు వారి తల్లిదండ్రులను అనుకరించేందుకు ప్రయత్నిస్తారని తెలుసుకోండి. బయటకు వెళ్లినప్పుడు స్వేచ్ఛగా తిరగనివ్వండి. ఎగరకూడదు, గెంతకూడదు అని నిబంధనలు పెట్టకండి.

నమ్మకం పోతుంది
పిల్లలు ఏమైనా చెప్పినప్పుడు ఏకాగ్రతతో వినండి. అంతేగాని నామమాత్రంగా ఊకొట్టి వదిలేయకండి. దీనివల్ల తాము ఏం చెప్పినా తల్లిదండ్రులు వినరు అన్న భావనకు వచ్చేస్తారు. అనుకోకుండా వారు ఏమైనా తప్పు చేసినప్పుడు సంజాయిషీ చెప్పినప్పుడు వారివైపు నుంచి కూడా ఆలోచించండి.. అనాలోచితంగా పిల్లలదే తప్పు అని రుద్దకండి. దీనివల్ల మీపై పిల్లలు నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి గురయ్యి.. మానసిక రుగ్మతలతో బాధపడే ఆస్కారం ఉంది.

ఫ్రెండ్స్‌లా ఉండండి
పిల్లలతో ఫ్రెండ్స్‌లా పేరంట్స్‌ ఉంటే.. వారు మీతో వారుకున్న అన్ని సమస్యలను మనసు విప్పి చెప్పుకోగలరు. వారి ఇష్టాయిష్టాలు పంచుకోగలుగుతారు. వారితో ఎక్కువ సమయం గడపటానికి ట్రై చేయండి. మీ ఆఫీస్‌ సమస్యలు ఇంటి వరకు తీసుకురాకండి. పిల్లల వద్ద ఆర్థిక సమస్యల గురించి మాట్లాడకండి. తరుచుగా పిల్లలను బయట తిప్పండి. భార్యభర్తల మధ్య వివాదాలు సహజమే.. కానీ పిల్లల ముందు మీ కోపతాపాలు చూపించకండి. అమ్మ కూచి, నాన్న కూచి అన్న స్టాంప్‌ను పిల్లలు మీద వేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manchu Manoj | “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తాజాగా హీరో మంచు మనోజ్(Manchu...

YS Jagan | నారావారి పాలనను అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమేనా..?

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు...